డబ్ల్యూటీసీ ఫైనల్లో కొత్త జెర్సీ ధరించనున్న టీమిండియా
- జూన్ 18 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్
- ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్ తో మ్యాచ్
- నూతన జెర్సీలతో బరిలో దిగనున్న టీమిండియా ఆటగాళ్లు
- సోషల్ మీడియాలో కొత్త జెర్సీని ప్రదర్శిస్తున్న ఆటగాళ్లు
జూన్ 18 నుంచి న్యూజిలాండ్ తో సౌతాంప్టన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం త్వరలోనే ఇంగ్లండ్ పయనం కానున్న భారత బృందం ప్రస్తుతం ముంబయిలో క్వారంటైన్ లో ఉంది. ఇంగ్లండ్ వెళ్లిన తర్వాత అక్కడి నిబంధనల ప్రకారం మరికొన్ని రోజులు క్వారంటైన్ లో ఉండనున్నారు.