తెలంగాణలో కొత్తగా 3,527 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 97,236 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 519 కొత్త కేసులు
- అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 15 మందికి కరోనా
- రాష్ట్రంలో 19 మంది కరోనాతో మృతి
రాష్ట్రంలో ఇప్పటివరకు 5,71,044 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,30,025 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 37,793 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,226కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు 92.81 శాతానికి పెరిగింది.