ఏపీలో మరో 14,429 కరోనా పాజిటివ్ కేసులు, 103 మరణాలు
- గత 24 గంటల్లో 84,502 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 2,291 కొత్త కేసులు
- అత్యల్పంగా విజయనగరంలో 535 కేసులు
- 20,746 మందికి కరోనా నయం
- ఇంకా 1,80,362 మందికి చికిత్స
అదే సమయంలో 20,746 మంది కరోనా నుంచి కోలుకోగా, 103 మంది మరణించారు. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 మంది చొప్పున మహమ్మారికి బలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,57,986 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 14,66,990 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,80,362 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 10,634కి చేరింది.