స్టార్ హీరోతో 'జాంబిరెడ్డి' దర్శకుడి సినిమా!
- విభిన్నమైన కథా చిత్రాలు
- కొత్తదనానికి ప్రాధాన్యత
- 'జాంబి రెడ్డి'తో హిట్
- మరో ప్రాజెక్టుకు శ్రీకారం
ఇక ఒక స్టార్ హీరో తో మరో ప్రాజెక్టును సెట్ చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆ స్టార్ హీరోకి కథ వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. రేపు ప్రశాంత్ వర్మ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయన తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నాడని చెబుతున్నారు. స్టార్ హీరో ఎవరనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. రేపు రిలీజ్ కానున్న పోస్టర్ చాలా వివరాలు అందించవచ్చని అనుకుంటున్నారు.