Prabhas: టైమ్ మెషీన్ లో ముందుకు వెళ్లనున్న ప్రభాస్!

Prabhas another movie concept is on Time Machine
షార్ట్స్‌లో చూడండి
ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ .. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు కథ వినిపించి, ఒప్పించడం కష్టమే. అలాంటి ప్రభాస్ ను ఇలా కథ వినిపించేసి .. అలా ఒప్పించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అంతగా ఆ కథలో ఏముందనేది ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. సోషియో ఫాంటసీని టచ్ చేస్తూ సాగే సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది అని నాగ్ అశ్విన్ చెప్పడంతో, ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకే నాగ్ అశ్విన్ ఏడాది పాటు సమయం తీసుకోవడం విశేషం.

ఈ సినిమాలో కథానాయకుడు టైమ్ ట్రావెల్ చేస్తాడట. అలా టైమ్ మెషీన్ లో ఆయన 2050 కాలానికి వెళ్లిపోతాడు. అక్కడ ఏం జరుగుతుంది? అప్పుడు అతను ఏం చేస్తాడు? అనే పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందట. అప్పటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడు తెరపై చూపించాలనుకోవడం నిజంగానే సాహసం అవుతుంది. అందుకేనేమో ఆయన గ్రాఫిక్స్ కి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టుగా చెప్పాడు. ఈ పాన్ ఇండియా సినిమాతో నాగ్ అశ్విన్ ఏ స్థాయిలో సంచలనాన్ని సృష్టిస్తాడో చూడాలి.
Go Back to Shorts
Prabhas
Nag Ashwin
Pan India Movie

More Telugu News