తెలంగాణలో మరో 3,614 మందికి కరోనా పాజిటివ్

TS Corona Update
తెలంగాణలో కొవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 90,226 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,614 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 504 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

నల్గొండ జిల్లాలో 229, ఖమ్మం జిల్లాలో 228, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 204 కేసులు గుర్తించారు. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 3,961 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,207కి పెరిగింది.  

తెలంగాణలో ఇప్పటివరకు 5,67,517 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,26,043 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 38,267 మందికి చికిత్స జరుగుతోంది. అటు, రికవరీ రేటు 92.69 శాతానికి పెరిగింది. జాతీయస్థాయి రికవరీ రేటు 90 శాతంగా ఉంది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Update
Positive Cases
Recovery Rate

More Telugu News