కేంద్ర ప్ర‌భుత్వం పంపిన నోటీసుల‌పై వాట్స‌ప్ స్పంద‌న‌!

whats app on govt notices
  • వాట్సప్ కొత్త‌ ప్రైవసీ పాలసీపై వివ‌ర‌ణ‌
  • వినియోగదారుల భద్రతకే తాము  ప్రాధాన్యం ఇస్తామన్న వాట్స‌ప్
  • యూజర్ల వ్యక్తిగత సందేశాల గోప్యతకు భంగం కలగదని వ్యాఖ్య‌
  • కార్యాచరణలో ఎలాంటి మార్పులూ ఉండబోవ‌ని స్ప‌ష్టం  
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ కొత్త‌ ప్రైవసీ పాలసీపై గంద‌ర‌గోళం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. వాట్స‌ప్ కొత్త పాల‌సీపై కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్ప‌టికే అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కేంద్ర ఐటీ శాఖ పలు ప్రశ్నలతో నోటీసును పంపి, 15 రోజుల్లో స‌మాధానం చెప్పాల‌ని ఇటీవ‌ల ఆదేశించింది.  

దీనిపై వాట్స‌ప్ స్పందిస్తూ త‌మ‌ వినియోగదారుల భద్రతకే తాము ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. భారత ప్రభుత్వం పంపిన లేఖపై త‌మ స‌మాధానం ఇచ్చామని వివ‌రించింది. వినియోగదారుల గోప్యతే త‌మ‌కు ప్రధానమ‌ని భార‌త‌ ప్ర‌భుత్వానికి హామీ ఇచ్చామని పేర్కొంది.  

తాము తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ వల్ల యూజర్ల వ్యక్తిగత సందేశాల గోప్యతకు భంగం కలగదని తెలిపింది. స‌మీప‌ భ‌విష్య‌త్తులో త‌మ‌ కార్యాచరణలో ఎలాంటి మార్పులూ ఉండబోవ‌ని స్ప‌ష్టం చేసింది. త‌మ యూజ‌ర్ల‌కు ప్రైవసీ పాలసీ గురించి అప్‌డేట్లు ఇస్తూనే ఉంటామ‌ని పేర్కొంది.
Go Back to Shorts
whats app
India

More Telugu News