'సింగం 4' షూటింగుకి ముహూర్తం కుదిరినట్టే!
- సూర్యకి కలిసొచ్చిన 'సింగం' సిరీస్
- కథానాయికగా వినిపిస్తోన్న అనుష్క పేరు
- ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్
ఈ సినిమాలో కూడా కథానాయికగా అనుష్కనే తీసుకోవాలని అనుకుంటున్నారట. అయితే అనుష్క ఓకే చెబుతుందో .. లేదో చూడాలి. ప్రస్తుతం సూర్య సినిమాలు మూడు సెట్స్ పై ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ కూడా కరోనా కారణంగా ఆలస్యమైనవే. చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంటున్నవే. ఈ మూడింటిలో వెట్రి మారన్ దర్శకత్వం వహిస్తున్న 'వడివాసల్' పై సూర్య గట్టినమ్మకమే పెట్టుకున్నాడని అంటున్నారు. జల్లికట్టు నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుండటం విశేషం.