ఒక్కమాటలో పాయల్ తేల్చిపారేసిందే!
- 'ఆర్ ఎక్స్ 100'తో లభించిన హిట్
- అంతగా కలిసిరాని పెద్ద సినిమాలు
- అవకాశాల కోసం వెయిటింగ్
- పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసిన పాయల్
ఈ నేపథ్యంలోనే 'బంగార్రాజు' సినిమాలోనూ ఆమె ఒక ఐటమ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కల్యాణ్ కృష్ణ దర్శకుడిగా నాగార్జున హీరోగా ఈ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాలోని ఒక ఐటమ్ సాంగ్ కోసం పాయల్ ను సంప్రదిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అందుకు పాయల్ స్పందిస్తూ .. "నేను ఏ స్పెషల్ సాంగ్ లో కనిపించడం లేదు' అంటూ స్పష్టం చేసింది. అలా జోరుగా జరుగుతున్న ఈ ప్రచారానికి పాయల్ సింపుల్ గా ఫుల్ స్టాప్ పెట్టేసిందన్న మాట.