రంగంలోకి దిగుతున్న ఖుషీ కపూర్!
- బాలీవుడ్ లో ఎదుగుతున్న జాన్వీ కపూర్
- నటనలో శిక్షణ పూర్తి చేసిన ఖుషీ కపూర్
- త్వరలో వెండితెరకి పరిచయం దిశగా పనులు
ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ ను కూడా రంగంలోకి దింపడానికి బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే ఆమె అందాలకు మెరుగులు దిద్దుకోవడం .. నటనలో శిక్షణ తీసుకోవడం పూర్తయిందట. దాంతో ఆమెను కూడా వెండితెరకి పరిచయం చేయడానికి బోనీ కపూర్ సిద్ధమవుతున్నారట. ముందుగా బాలీవుడ్ కి ఆయన ప్రాధాన్యతను ఇచ్చాడట. కుదరకపోతే కోలీవుడ్ .. టాలీవుడ్ సినిమాలతోను ఆమెను పరిచయం చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో ముందుగా ఎవరు టాలీవుడ్ కి పరిచయం కానున్నారనేది ఆసక్తికరంగా మారింది.