బ్లాక్‌ఫంగస్‌తో ఏపీలో ముగ్గురి మృతి.. ప్రకాశంలో చెలరేగుతున్న వ్యాధి
- ప్రకాశం జిల్లాలో 36 మందిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు
- 20 మందికి ఒంగోలులో చికిత్స
- నలుగురికి అత్యవసర వైద్యం అవసరం
- ఆపరేషన్ కోసం విజయవాడ, హైదరాబాద్‌కు తరలింపు
ఇక కర్నూలు జిల్లా నాగులాపురానికి చెందిన కేవీ ప్రసాద్ (68) ఈ వ్యాధి బారినపడి మృతి చెందారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన నిన్న మరణించారు. కృష్ణా జిల్లాకు చెందిన చింతా వెంకటేశ్వరరావు (64) బ్లాక్ ఫంగస్ లక్షణాలతో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించారు. అలాగే, గుంటూరు జిల్లా నారాకోడూరుకు చెందిన కట్టా సాంబయ్య (55) వారం రోజులుగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.