లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చిన నటుడు నిఖిల్... అడ్డుకున్న పోలీసులు
- ఈ-పాస్ లేదంటూ అడ్డుకున్న పోలీసులు
- కిమ్స్‌లో మందులు ఇచ్చేందుకు వెళ్తున్నానన్నా అనుమతి నిరాకరణ
- ఉన్నతాధికారులకు ట్వీట్ చేయడంతో అనుమతి
కిమ్స్‌లో చికిత్స పొందుతున్న రోగికి మందులు ఇచ్చేందుకు వెళ్తున్నానని, ఈ-పాస్ కోసం ప్రయత్నించినప్పటికీ సర్వర్ సమస్యల వల్ల లభించలేదని చెప్పాడు. ఈ-పాస్ కోసం తాను 9సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపాడు. రోగికి మందులు ఇచ్చేందుకు వెళ్తున్నాను కాబట్టి మెడికల్ ఎమర్జెన్సీగా భావించి అనుమతిస్తారనే ఉద్దేశంతో బయలుదేరానని చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. దీంతో నిఖిల్ ట్విట్టర్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించాడు. వెంటనే స్పందించిన పోలీసులు లొకేషన్ పంపితే అక్కడి పోలీసులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో నిఖిల్ అలాగే చేశాడు. ఆ తర్వాత పోలీసులు అతనిని అనుమతించారు.