టాలీవుడ్ మహిళా కార్మికులకు కమెడియన్ అలీ దంపతుల సాయం
- కరోనా కారణంగా నిలిచిన సినీ కార్యకలాపాలు
- ఉపాధి లేక అలమటిస్తున్న కార్మికులు
- ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్ సభ్యులకు అలీ వితరణ
- రూ.2 లక్షల వ్యయంతో నిత్యావసరాల అందజేత
ఈ మహిళా కార్మికులు తమకంటే ముందే షూటింగ్ స్పాట్ కు వెళ్లిపోయి విధులు నిర్వర్తిస్తుంటారని, తాము తిన్న ప్లేట్లను, కాఫీ కప్పులను కూడా శుభ్రం చేస్తుంటారని వివరించారు. కరోనా కారణంగా పని లేక వారు ఇబ్బంది పడుతుంటే తన వంతుగా స్పందించానని అలీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అలీ సోదరుడు ఖయ్యూం తదితరులు కూడా పాల్గొన్నారు.