తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- వాయుగుండంగా మారిందని ఐఎండీ
- ఉత్తర వాయవ్య దిశగా పయనం
- రేపటికి తుపానుగా మారే అవకాశం
- ఈ నెల 26న తీరం దాటనున్న తుపాను
అయితే, యాస్ తుపాను ప్రభావం ఏపీ, తెలంగాణపై కొద్దిమేర మాత్రమే ఉంటుందని తెలిపింది. రేపు ఉదయం కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు కురుస్తాయని పేర్కొంది. తుపాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయని, ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉన్నాయని ఐఎండీ తెలిపింది.