కంగనా రనౌత్ బాడీగార్డుపై అత్యాచార ఆరోపణలు... కేసు నమోదు
- చిక్కుల్లో కంగనా బాడీగార్డు కుమార్ హెగ్డే
- కుమార్ పై ఫిర్యాదు చేసిన బ్యూటీషియన్
- పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని ఆరోపణ
- ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబయి పోలీసులు
కంగనా బాడీగార్డు కుమార్ హెగ్డే, సదరు బ్యూటీషియన్ గత 8 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. అయితే, శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ బలవంతం చేసేవాడని, అందుకు నిరాకరించడంతో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బ్యూటీషియన్ తన ఫిర్యాదులో పేర్కొంది.