ఫుడ్ డెలివరీ బాయ్స్ ను అడ్డుకున్న హైదరాబాద్ పోలీసులు... ఆందోళనకు దిగిన జొమాటో, స్విగ్గీ సిబ్బంది
- తెలంగాణలో లాక్ డౌన్ అమలు
- నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు
- ఎక్కడికక్కడ ఫుడ్ డెలివరీ బాయ్స్ నిలిపివేత
- బైకుల స్వాధీనం
- ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా
తాము ఆర్డర్లపై ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వస్తే తమను అడ్డుకోవడం ఏం న్యాయమని ప్రశ్నించారు. ఫుడ్ డెలివరీ నిలిపివేతపై తమ సంస్థల నుంచి ఎలాంటి సమాచారం లేదని, కానీ పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని వారు విచారం వ్యక్తం చేశారు. కాగా, ఆర్డర్లు లేని ఫుడ్ డెలివరీ బాయ్స్ ను మాత్రమే తాము నిలిపివేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు.