Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎట్ట‌కేల‌కు మా అమ్మ హ్యాపీగా ఫీలైంది: మంచు ల‌క్ష్మి ఆస‌క్తిక‌ర ట్వీట్

manchu lakshmi interesting tweet
  • విశేషంగా ఆక‌ట్టుకుంటోన్న‌ కార్తీక దీపం సీరియ‌ల్‌
  • సీరియ‌ల్‌లో హీరో పాత్ర‌కు నిజం తెలియ‌డంతో ఏడుపు
  • సామాజిక మాధ్య‌మాల్లో ఫొటోలు తెగ వైర‌ల్
  • డాక్ట‌ర్ బాబు ఏడ్చినందుకు త‌మ త‌ల్లి హ్యాపీ ఫీలైంద‌ని ట్వీట్  
'కార్తీక దీపం సీరియ‌ల్‌లో మొద‌టిసారి డాక్ట‌ర్ బాబు కార్తీక్ ఏడ్చాడు అట.. ఎట్ట‌కేల‌కు మా అమ్మ హ్యాపీగా ఫీలైంది' అంటూ సినీ న‌టి మంచు ల‌క్ష్మి చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. తెలుగు వారిని విశేషంగా ఆక‌ట్టుకుంటోన్న కార్తీక దీపం సీరియ‌ల్‌లో కార్తీక్ అనే పాత్ర ఉంటుంది. డాక్ట‌ర్ బాబుగా ఆయ‌న న‌టన అద‌ర‌హో అనిపిస్తోంది.

ఇందులో వంట‌ల‌క్క పాత్ర గురించి ప్ర‌త్యేకంగా చెప్పే అవ‌స‌రం లేదు. ఈ సీరియల్ క‌థ ఏంటంటే  దీప అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అనుమానంతో వదిలేస్తాడు డాక్టర్ బాబు. ఆమెకు పుట్టిన కవలలు చివ‌ర‌కు తల్లిదండ్రులను ఎలా కలిపారనే నేపథ్యంతో ఈ సీరియ‌ల్ తీస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో డాక్ట‌ర్ బాబుకు అస‌లు నిజం తెలుస్తుంది. దీంతో ఎన్న‌డూ లేని విధంగా క‌న్నీరు పెట్టుకుంటాడు.

       
ఈ సీరియల్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా భావోద్వేగాల‌ను పండిస్తూ మ‌హిళ‌ల‌తో క‌న్నీరు పెట్టిస్తూ ఈ సీరియ‌ల్ కొన‌సాగుతోంది. మొద‌టి సారి డాక్ట‌ర్ బాబు క‌న్నీరు పెట్టుకోవ‌డంతో సామాజిక మాధ్య‌మాల్లో ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

చివ‌ర‌కు మంచు ల‌క్ష్మి కూడా దీనిపై ట్వీట్ చేసిందంటే ఈ సీరియ‌ల్‌కు సెల‌బ్రిటీల ఇంట్లో కూడా ఉన్న క్రేజ్ ఏంటో అర్థ‌మవుతోంది. కాగా, మరికొంద‌రు నెటిజ‌న్లు డాక్ట‌ర్ బాబు క‌న్నీరు పెట్టుకోవ‌డంపై సెటైర్లు వేస్తున్నారు. స్టార్ మాలో ప్ర‌సార‌మ‌య్యే ఈ సూప‌ర్ డూప‌ర్  హిట్ సీరియ‌ల్ గురించే మ‌హిళ‌లంతా చ‌ర్చించుకుంటున్నార‌ని కామెంట్లు చేస్తున్నారు.

kartikadeepam
Manchu Lakshmi
Tollywood
Viral Pics

More Telugu News