ఆనందయ్య మందుపై పరిశీలన కోసం కృష్ణపట్నం చేరుకున్న ఐసీఎంఆర్ బృందం
- కృష్ణపట్నంలో ఆనందయ్య మూలికా వైద్యం
- కరోనాపై బాగా పనిచేస్తోందంటూ ప్రచారం
- భారీగా తరలివస్తున్న ప్రజలు
- ఆనందయ్య ఔషధం వివరాలు తెలుసుకున్న ఐసీఎంఆర్
- చెట్ల ఆకులు, పదార్థాల పరిశీలన
కృష్ణపట్నంలో ఆనందయ్య అందించే మూలికా ఔషధం కరోనాను తగ్గించడంలో మెరుగ్గా పనిచేస్తోందంటూ ప్రచారం జరగడంతో ప్రజలు పోటెత్తడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆ ఔషధం సమర్థత తెలిసేదాకా పంపిణీ నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.