ప్రముఖ పర్యావరణవేత్త సుందర్ లాల్ బహుగుణ కరోనాతో మృతి
- ఇటీవలే బహుగుణకు కరోనా
- ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత
- విచారం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం
- బహుగుణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
గత 5 దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలపైనా, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతరించిపోతున్న వృక్ష, జంతు, పక్షిజాతుల రక్షణకు జీవితాంతం కృషి చేస్తూనే ఉన్నారని కొనియాడారు. పర్యావరణ అంశాలపై తన జీవితాంతం పరితపించిన బహుగుణ మరణం ప్రకృతి,. జీవావరణ, పర్యావరణ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. బహుగుణ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.