Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క‌రోనా వేళ‌ పెళ్లిళ్లు వాయిదా వేస్తూ ఆదేశాలు ఇవ్వండి.. దీంతో నా గ‌ర్ల్ ఫ్రెండ్ పెళ్లి కూడా ఆగిపోతుంది: బీహార్ సీఎంకు యువ‌కుడి ట్వీట్

bihar man tweet goes viral
  • వైర‌ల్ అవుతోన్న ట్వీట్
  • సెటైర్లు వేస్తోన్న నెటిజ‌న్లు
  • ప్రియురాలి పెళ్లిని ఆపేందుకు యువ‌కుడి ట్వీట్
క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో బీహార్‌లోనూ మే 25 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే పెళ్లి ముహూర్తం పెట్టుకున్న వారు వివాహాన్ని త‌క్కువ మంది అతిథుల‌తో నిర్వహించాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, లాక్‌డౌన్‌లో త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ వివాహం మ‌రో అబ్బాయితో జ‌రుగుతోంద‌ని తెలుసుకున్న ఓ యువ‌కుడు ఆమె పెళ్లిని ఆపేందుకు చేసిన ఓ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో అన్ని వివాహ వేడుక‌ల‌ను వాయిదా వేయాల‌ని ఆదేశించాల‌ని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ట్వీట్ ద్వారా ఆయ‌న‌ కోరాడు. వివాహాలపై నిషేధం విధిస్తే, త‌న‌ ప్రియురాలి వివాహం కూడా నిలిచిపోతుందని ఆయ‌న పేర్కొన్నాడు.

అలా చేస్తే సీఎంకు తాను రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పాడు. ప్రియురాలి వివాహం ఆపేందుకు మంచి ప్లాన్ వేశావంటూ అత‌డిపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు. క‌రోనా వేళ విధించిన లాక్‌డౌన్ గ‌ర్ల్ ఫ్రెండ్లు వ‌దిలించుకున్న బాయ్ ఫ్రెండ్ల‌కు ఇలా ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని జోకులు వేస్తున్నారు.
Bihar
Twitter
Nitish Kumar

More Telugu News