తెలంగాణలో కొత్తగా 3,837 కరోనా కేసులు, 25 మరణాలు
- గత 24 గంటల్లో 71,070 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో తగ్గుముఖం పడుతున్న కేసులు
- తాజాగా 594 మందికి పాజిటివ్
- రాష్ట్రవ్యాప్తంగా 25 మంది మృతి
- తెలంగాణలో రికవరీ రేటు 90.75 శాతం
రాష్ట్రంలో ఇప్పటివరకు 5,40,603 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,90,620 మంది కోలుకున్నారు. ఇంకా 46,946 మందికి కరోనా చికిత్స జరుగుతోంది. అటు, మొత్తం మరణాల సంఖ్య 3,037కి చేరింది.
కాగా, జాతీయస్థాయిలో కరోనా మరణాల రేటు 1.1 శాతం ఉండగా, తెలంగాణలో 0.56 శాతంగా నమోదైంది. దేశంలో రికవరీ రేటు 86.2 శాతం కాగా, తెలంగాణలో 90.75 శాతంగా ఉంది.