గుజరాత్ లో తుపాను సహాయచర్యలకు రూ.1000 కోట్లు ప్రకటించిన ప్రధాని మోదీ
- గుజరాత్ వద్ద తీరం దాటిన తౌతే
- ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని
- అహ్మదాబాద్ లో సమీక్ష సమావేశం
- గుజరాత్ లో నష్టం అంచనాకు కేంద్ర బృందం ఏర్పాటు
- మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే తుపాను గుజరాత్ లోని పోరుబందర్, మహువా మధ్య తీరం దాటింది. తీరం దాటే సమయంలో ఇది పెను తుపాను స్థాయిలో ఉండడంతో విధ్వంసం కూడా అదే స్థాయిలో జరిగింది. గుజరాత్ లోని 12 జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. దీని ప్రభావంతో 45 మంది మరణించారు. ఒక్క ఆమ్రేలీ జిల్లాలోనే 15 మంది మృతి చెందారు. అపార ఆస్తినష్టం సంభవించింది.