ఎన్440కె వ్యాపిస్తోందంటూ భయపెట్టారు: మంత్రి అప్పలరాజుపై పోలీసులకు ఫిర్యాదు

ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారంటూ న్యాయవాది ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌లోని ఎన్440కె రకం వ్యాపిస్తోందని మంత్రి చెప్పడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని కృష్ణా జిల్లా మైలవరం మండలం పొందుగులకు చెందిన న్యాయవాది భూక్య మల్లికార్జునరావు మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న మంత్రిపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఇలాంటి ఆరోపణలతోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపైనా రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

Seediri Appalaraju
Andhra Pradesh
N440K
Mylavaram

More Telugu News