కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు... ఏపీ సర్కారు ఉత్తర్వులు
- కొవిడ్ మృతుల అంత్యక్రియలపై సీఎం జగన్ నిర్ణయం
- ఆర్థికసాయంపై కలెక్టర్లకు అధికారాలు
- 2021-22 ఏడాదికి వర్తించేలా నిర్ణయం
- ఉత్తర్వులు జారీ చేసిన అనిల్ కుమార్ సింఘాల్
ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ నియంత్రణ, సహాయ చర్యలకు కేటాయించిన నిధుల నుంచి ఈ ఆర్థికసాయం అందజేయాలని కలెక్టర్లకు సూచించారు. ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్లకు విడుదల చేస్తారని వివరించారు.