హర్యానా రైతులపై పోలీసుల లాఠీ చార్జీ
- కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించేందుకు వెళ్లిన హర్యానా సీఎం
- సాగు చట్టాలు రద్దు చేయాలంటూ ఘెరావ్ చేసిన రైతులు
- పోలీస్ బారికేడ్లను లాగిపారేసిన వైనం
- బాష్పవాయు గోళాలు ప్రయోగించిన పోలీసులు
దీంతో రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో రైతులు రెచ్చిపోయి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను లాగిపారేశారు. దీంతో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు.
సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని సింఘూ, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళనను విరమించాలని కేంద్రం విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు.