తీవ్ర తుపానుగా మారనున్న 'తౌతే '... ఏపీకి వర్షసూచన
- అరేబియా సముద్రంలో కొనసాగుతున్న 'తౌతే'
- మరో 18 గంటల్లో అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం
- ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరం దాటనున్న 'తౌతే'
- నేడు, రేపు ఏపీలో ఓ మోస్తరు వర్షాలు
- విదర్భ పరిసరాల్లో బలహీనపడిన ఉపరితల ఆవర్తనం
'తౌతే' తుపాను ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరాన్ని తాకనుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య పోరుబందర్-నలియా ప్రాంతాల నడుమ భూభాగంపైకి ప్రవేశించనుంది.
'తౌతే' ప్రభావం ఏపీపైనా పాక్షికంగా ఉండనుందని వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది. రాష్ట్రంలో నేడు, రేపు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు.
కాగా, విదర్భ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో కొన్నిరోజులుగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే.