పగలు ఫుడ్ డెలివరీలు... రాత్రి దారిదోపిడీలు!
- హైదరాబాదులో ఆరుగురు సభ్యుల ముఠా అరెస్ట్
- అదుపులోకి తీసుకున్న బాచుపల్లి పోలీసులు
- స్విగ్గీ, జొమాటోలో పనిచేస్తున్న యువకులు
- రాత్రివేళల్లో ఒంటరిగా కనిపించినవారిపై దాడులు
- దోచుకున్న వస్తువులు ఓఎల్ఎక్స్ లో విక్రయం
రాత్రివేళ ఒంటరిగా కనిపించే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా దోపిడీలకు తెగబడుతున్నట్టు గుర్తించారు. దోచుకున్న వస్తువులను ఓఎల్ఎక్స్ లో విక్రయిస్తుంటారు. విలాసాలకు అలవాటు పడిన వీరు, పగలు స్విగ్గీ, జొమాటోలో పనిచేస్తూ, రాత్రివేళల్లో దొంగతనాలు చేస్తున్నట్టు గుర్తించారు.