తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా పాజిటివ్ కేసులు, 29 మరణాలు
- గత 24 గంటల్లో 57,416 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 607 కొత్త కేసులు
- ఇతర జిల్లాల్లోనూ తగ్గిన కేసులు
- యాక్టివ్ కేసుల సంఖ్య 54,832
తెలంగాణలో ఇప్పటివరకు 5,20,709 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,62,981 కొవిడ్ ప్రభావం నుంచి బయటపడ్డారు. ఇంకా 54,832 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 2,896కి పెరిగింది.