ఏపీలో ఏమాత్రం తగ్గని కొవిడ్ తీవ్రత... ఒక్కరోజులో 96 మంది మృత్యువాత
- రాష్ట్రంలో కరోనా మృత్యుఘంటికలు
- అనంతపురం జిల్లాలో 11 మంది మృతి
- గత 24 గంటల్లో 89,087 కరోనా టెస్టులు
- 22,018 మందికి పాజిటివ్
- తూర్పు గోదావరి జిల్లాలో 3 వేలకు పైగా కొత్తకేసులు
గత 24 గంటల్లో ఏపీలో 89,087 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,018 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 3,432 కొత్త కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లోనూ కరోనా బీభత్సం కనిపించింది. అదే సమయంలో 19,177 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 13,88,803 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 11,75,843 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,03,787 మంది చికిత్స పొందుతున్నారు.