Balakrishna: క‌రోనా బాధితులకు మందులు సమకూర్చుతున్న బాల‌కృష్ణ!

balakrishna helps people
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా విజృంభిస్తోన్న నేప‌థ్యంలో  హిందూపురం ఎమ్మెల్యే, సినీన‌టుడు బాలకృష్ణ ప్ర‌జ‌ల‌కు రూ.20 ల‌క్ష‌ల విలువ చేసే క‌రోనా మందుల‌ను సాయంగా అందిస్తున్నారు. హిందూపురంలోని చౌడేశ్వరి కాలనీలోని బాల‌య్య‌ నివాసం వద్ద స్థానిక టీడీపీ నాయకులు వాటిని ప్ర‌జ‌లకు అందజేశారు.

క‌రోనా లక్షణాలు ఉన్న వారు ఆధార్ కార్డుతో బాల‌య్య నివాసానికి వస్తే, కరోనా మందులను అందజేస్తామని టీడీపీ నేత‌లు తెలిపారు. హిందూపురం ప్రజల ఇబ్బందులను అధ్యయనం చేసిన బాల‌కృష్ణ ఈ  రూ.20 లక్షలు విలువ చేసే మందులను పంపిణీ చేస్తున్నార‌ని వారు వివ‌రించారు. ఇవి చాల‌క‌పోతే మరిన్ని కొవిడ్ ఔష‌ధాల‌ను కూడా ఇవ్వ‌డానికి త‌మ నేత సిద్ధంగా ఉన్నార‌ని చెప్పారు. క‌రోనా నియంత్ర‌ణ‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు.
Go Back to Shorts
Balakrishna
Telugudesam

More Telugu News