లాక్ డౌన్ నేపథ్యంలో 'మందు'జాగ్రత్త చర్యలు... వైన్ షాపుల ముందు భారీ క్యూలు
- తెలంగాణలో 10 రోజుల పాటు లాక్ డౌన్
- రేపటి నుంచి అమలు
- మద్యం దుకాణాల వేళలపై స్పష్టతలేని వైనం
- మద్యం దుకాణాలకు పోటెత్తిన మందుబాబులు
- భౌతికదూరం నిబంధనకు తూట్లు
హైదరాబాదులోని వైన్ షాపుల వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. కొన్నిచోట్ల ఈ క్యూలు కిలోమీటర్ల మేర ఉన్నాయంటే మందుబాబుల ముందుజాగ్రత్త ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది కేసుల కొద్దీ మద్యం, బీర్లు కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు. అయితే, మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం నిబంధన అమలు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం.