విశాఖకు ఆక్సిజన్ ట్యాంకర్లు మోసుకొచ్చిన ఐరావత్ నౌక

INS Airavat Reaches Visakhapatnam From Singapore
  • ఈ నెల 5న సింగపూర్ నుంచి బయలుదేరిన నౌక
  • అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ ట్యాంకర్లు
  • సముద్రసేతు-2 కార్యక్రమంలో 9 నౌకలు
ఆక్సిజన్ ట్యాంకర్లు, సిలిండర్లు, అత్యవసర ఔషధాలతో సింగపూర్ నుంచి ఈ నెల 5న బయలుదేరిన భారత నౌక ఐఎన్ఎస్ ఐరావత్ నిన్న విశాఖపట్టణం చేరుకుంది. నౌక మోసుకొచ్చిన వాటిలో 8 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు, 3898 ఆక్సిజన్ సిలిండర్లు, కొవిడ్ మందులు ఉన్నాయి. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించనున్నారు.

 దేశంలో కరోనాతో అల్లాడుతున్న వారిని రక్షించేందుకు తూర్పు నావికాదళం సముద్రసేతు-2 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 9 నౌకలు వివిధ దేశాలకు తరలివెళ్లాయి. అందులో ఐరావత్ ఒకటి. వివిధ దేశాల నుంచి సేకరించిన ద్రవ ఆక్సిజన్, కొవిడ్ ఔషధాలను సేకరించి భారత్ కు తరలిస్తున్నారు.
Go Back to Shorts
INS Airavat
Singapore
Visakhapatnam
COVID19

More Telugu News