Vijay: విజయ్ నటించే తెలుగు సినిమాకి భారీ పారితోషికం!

Vijay takes huge remuneration for Vamshi Paidipalli movie
  • 65వ సినిమాతో విజయ్
  • నెక్స్ట్ మూవీ వంశీ పైడిపల్లితో
  • నిర్మాతగా దిల్ రాజు
  • 175 కోట్ల బడ్జెట్ అంటూ టాక్    
తమిళనాట విజయ్ కి ఉన్న క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఒక సినిమా పూర్తవుతూ ఉందనగానే మరో సినిమా సెట్స్ పైకి వెళ్లేలా ఆయన ప్లాన్ చేసుకుంటాడు. ఇక ఆయనకి కథలను వినిపించే దర్శక నిర్మాతలు లైన్లో ఉంటారు. ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా నిర్మాతలకు నష్టాలు వచ్చిన సందర్భాలు అతి తక్కువ. అలాంటి విజయ్ ప్రస్తుతం తన 65వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

తరువాత సినిమాను వంశీ పైడిపల్లితో విజయ్ చేయనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా విడుదల కానున్నట్టుగా చెప్పుకున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నాడని అన్నారు. అయితే ఇది నిజమా? కాదా? అని అనుకునేంతలో మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాను దాదాపు 175 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారనీ .. పారితోషికంగా విజయ్ కి 50 కోట్లకి పైనే ముట్టనుందని అంటున్నారు. మరి ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.
Vijay
Vamshi paidipalli
Dil Raju

More Telugu News