'ఖిలాడి' దర్శకుడితో పవన్ కల్యాణ్?
- పవన్ తో బండ్లకు సాన్నిహిత్యం
- గతంలో ఇద్దరి కాంబినేషన్లో సినిమాలు
- మరో ప్రాజెక్టుకు సన్నాహాలు
పవన్ కల్యాణ్ తో నిర్మాత బండ్ల గణేశ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరి కాంబినేషన్లో పెద్ద సినిమాలే వచ్చాయి. అయితే పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయనతో మరో ప్రాజెక్టును సెట్ చేయడానికి బండ్ల గణేశ్ ప్రయత్నిస్తున్నాడు. రమేశ్ వర్మ దగ్గర మంచి కథ ఉందని తెలిసిన బండ్ల గణేశ్, ఆయనను వెంటబెట్టుకుని వెళ్లాడట. ఆయన వినిపించిన కథ నచ్చడంతో, పవన్ ఓకే చెప్పారని అంటున్నారు. అయితే హరీశ్ శంకర్ .. సురేందర్ రెడ్డి ప్రాజెక్టులు పూర్తయిన తరువాతనే ఈ సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రవితేజ 'ఖిలాడి' సినిమాతో రమేశ్ వర్మ బిజీగా ఉన్నాడు.