బెంగళూరులో 6 వేల మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్
- తప్పుడు చిరునామాలతో కరోనా టెస్టులు చేయించుకుంటున్న వైనం
- ఆ తర్వాత పని చేయని ఫోన్ నెంబర్లు
- మిస్ అయిన వారి కోసం వెతుకుతున్న పోలీసులు
గతంలో కూడా దాదాపు 10 వేల మంది కరోనా పేషెంట్లు కనిపించకుండా పోయిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ తెలియలేదు. అయితే కరోనా పరీక్షలకు వచ్చిన వారు తప్పుడు ఫోన్ నెంబర్లు, తప్పుడు చిరునామాలు ఇచ్చారట. ఇక్కడ ఆందోళనకర విషయం ఏమిటంటే... కరోనా సోకిన విషయం వారికి కూడా తెలియకపోవడం. వీరిని వెతికేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా... ఏమాత్రం ఫలితం దక్కడం లేదు.