చోటా రాజన్ చనిపోలేదు: ఢిల్లీ పోలీసులు
- తీహార్ జైల్లో ఉన్న చోటా రాజన్
- కరోనా సోకడంతో ఎయిమ్స్ ఆసుపత్రికి తరలింపు
- ఆరోగ్యం విషమించి చనిపోయినట్టు వార్తలు
ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న రాజన్ కు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో, ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర నికల్జీ. భారత్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న రాజన్... 2015లో ఇండొనేషియా నుంచి పోలీసు అధికారులు తీసుకొచ్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అతన్ని తీహార్ జైల్లో ఉంచారు.