Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Nidhi Agarwal opposite Mahesh Babu
  • నిధి అగర్వాల్ కు మరో బిగ్ ఆఫర్ 
  • మరో రీమేక్ సినిమాలో వెంకటేశ్
  • ఓటీటీ షోకి ఓకే చెప్పిన ఇలియానా
*  ప్రస్తుతం పవన్ కల్యాణ్ సరసన 'హరహర మహాదేవ' సినిమాలో నటిస్తున్న కథానాయిక నిధి అగర్వాల్ కు త్వరలో మహేశ్ బాబు సరసన నటించే ఛాన్స్ కూడా వస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా రూపొందే సినిమా కోసం నిధి అగర్వాల్ ను సంప్రదిస్తున్నట్టు తాజా సమాచారం.
*  ప్రస్తుతం 'దృశ్యం 2' మలయాళ రీమేక్ లో నటిస్తున్న ప్రముఖ నటుడు వెంకటేశ్ తాజాగా మరో రీమేక్ సినిమాలో నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. మలయాళంలో వచ్చిన 'డ్రైవింగ్ లైసెన్స్' చిత్రం రీమేక్ ప్రాజక్టు ప్రస్తుతం వెంకటేశ్ వద్దకు వచ్చినట్టు, చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
*  ఒకప్పుడు దక్షిణాదిన బిజీ కథానాయికగా రాణించిన ఇలియానా.. ప్రస్తుతం హిందీలో ఒకటీ అరా సినిమాలలో మాత్రమే నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓటీటీ షోకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ షోను నిర్మించనుంది.
Nidhi Agarwal
Mahesh Babu
Venkatesh Daggubati
Ileana

More Telugu News