ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూ.. సరిహద్దుల వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు
- ఏపీలో మధ్యాహ్నం 12 నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ
- అత్యవసర సేవలకు మినహాయింపు
- ఏపీ-తెలంగాణ సరిహద్దుల మూసివేత
కాగా, నేటి నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం నిన్ననే ప్రకటించింది. ఈ నెల 18 వరకు కర్ఫ్యూ కొనసాగనుండగా విమాన, రైల్వే ప్రయాణికులను టికెట్లు చూపిస్తే మాత్రం అనుమతిస్తారు. ఇక, కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు మినహాయింపు ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, వైద్యులు, సిబ్బందికి ఆంక్షల నుంచి మినహాయింపు నిచ్చారు.