కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా శాశ్వతంగా నిలిపివేత
- బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం హింసపై కంగనా ట్వీట్
- ఆ ట్వీట్ తమ నిబంధనలకు విరుద్ధమన్న ట్విట్టర్
- గతంలోనూ కంగనా నిబంధనలు ఉల్లఘించారని వెల్లడి
- తన గొంతుక వినిపించేందుకు చాలా మార్గాలున్నాయన్న కంగనా
ప్రధాని నరేంద్ర మోదీ తన పాత విశ్వరూపాన్ని ప్రదర్శించి మమతా బెనర్జీని ఓ ఆటాడించాలని కంగనా చేసిన ట్వీట్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ కొరడా ఝుళిపించింది.
కాగా, ట్విట్టర్ తన ఖాతాను తొలగించడంపై కంగనా స్పందించారు. తన గళాన్ని వినిపించడానికి అనేక వేదికలు ఉన్నాయని అన్నారు. తాను స్వయంగా సినీ నటినని, సినిమాల ద్వారా కూడా తన అభిప్రాయాలను వెల్లడించగలనని స్పష్టం చేశారు.