తెలంగాణలో మరో 6,876 మందికి కరోనా పాజిటివ్
- రాష్ట్రంలో నిదానించిన కరోనా
- గత 24 గంటల్లో 70,961 కరోనా పరీక్షలు
- అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,029 కేసులు
- రాష్ట్రంలో మరో 59 మంది మృతి
- యాక్టివ్ కేసుల సంఖ్య 79,520
రాష్ట్రంలో ఇప్పటివరకు 4,63,361 పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,81,365 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 మందికి కరోనా చికిత్స కొనసాగుతోంది.