పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్?
- 'వకీల్ సాబ్'తో హిట్ కొట్టిన పవన్
- సెట్స్ పై మలయాళ మూవీ రీమేక్
- సాయిపల్లవి డేట్స్ లేవనే టాక్
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ భార్య పాత్ర్రలో సాయిపల్లవి కనిపించనున్నట్టుగా వార్తాలు వచ్చాయి. ఆ తరువాత ఐశ్వర్య రాజేశ్ పేరు వినిపించింది. పవన్ భార్య పాత్రకి వీరు సెట్ అవుతారా? అనే సందేహం అభిమానులను వెంటాడింది. అయితే సాయిపల్లవి డేట్స్ లేని కారణంగా నిత్యామీనన్ ను ఎంపిక చేసుకున్నారనే వార్త తాజాగా వినిపిస్తోంది. నిత్యామీనన్ ఎంత నేచురల్ గా చేస్తుందనే విషయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. నెక్స్ట్ షెడ్యూల్లో ఆమె షూటింగులో పాల్గొంటుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో నిత్యామీనన్ కి పడిన మంచి పాత్ర ఇది అని చెప్పుకోవచ్చు.