Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో కొత్త పేమెంట్​ ఫీచర్​ ను తీసుకొస్తున్న గూగుల్​ పే, కానీ...

Google Rolls out the plans for NFC Payments
  • దేశంలో ఎన్ఎఫ్ సీని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు
  • హై ఎండ్ ఫోన్లలోనే ఎన్ఎఫ్ సీ ఫీచర్ సపోర్ట్
  • అందరికీ ఆ ఫీచర్ అందడం కష్టమే
  • ఒకే ఒక్క ట్యాప్ తో నగదు చెల్లింపులు
గూగుల్ ఫే త్వరలోనే మరో కొత్త పేమెంట్ ఫీచర్ ను భారత్ లో అందుబాటులోకి తీసుకురానుంది. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ) అనే సరికొత్త ఫీచర్ ను జోడించబోతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ భారత్ లో అందుబాటులో లేకపోయినా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఎన్ఎఫ్ సీ ఫీచర్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇటీవలే క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి ఆ ఫీచర్ ను ప్రారంభించినా.. మెయిన్ స్ట్రీమ్ పేమెంట్లకూ దానిని వర్తింపజేసేందుకు సిద్ధమవుతోంది.

అయితే, ఈ ఫీచర్ పనిచేయాలంటే మాత్రం కచ్చితంగా స్మార్ట్ ఫోన్లు ఎన్ఎఫ్ సీ ఫీచర్ ను సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21 వంటి హై ఎండ్ ఫోన్లలోనే ఎన్ఎఫ్ సీ ఫీచర్ ఉంది. ఈ నేపథ్యంలోనే అది అందరికీ అందుబాటులోకి రావాలంటే మాత్రం మరింత సమయం పడుతుందని చెప్పకతప్పదు.

ఎలా పనిచేస్తుంది?

ఎన్ఎఫ్ సీ టెర్మినల్ దగ్గరకు ఫోన్ ను పెట్టినా లేదా ఫోన్ లోని ఎన్ఎఫ్ సీని ట్యాప్ చేసినా నేరుగా గూగుల్ పే ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత కట్టాల్సిన అమౌంట్ ను ఎంటర్ చేసి యూపీఐ పిన్ ను టైప్ చేసి ప్రొసీడ్ కొడితే పేమెంట్ జరిగిపోతుంది. ప్రస్తుతం మన దేశంలో పైన్ ల్యాబ్ టెర్మినల్స్ కు చెందిన పీవోఎస్ లలోనే ఈ ఎన్ఎఫ్ సీ ఫీచర్ ఉందని చెబుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని పీవోఎస్ లకూ దానిని పొడిగిస్తారని చెబుతున్నారు.
Google
Gpay
NFC
Payments
UPI

More Telugu News