'పైథాన్-5' మిస్సైల్ తో మరింత శత్రుభీకరంగా మారిన మన 'తేజస్'!
- ఐదోతరం పైథాన్ మిస్సైల్ ను అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ సంస్థ
- తేజస్ కు మరింత బలం చేకూర్చనున్న పైథాన్-5
- ఎయిర్ టు ఎయిర్ మిస్సైళ్లలో అగ్రగామిగా గుర్తింపు
- నిన్న ప్రయోగించిన డీఆర్డీవో
పైథాన్-5 మిస్సైల్ ను ఇజ్రాయెల్ కు చెందిన రఫేల్ అడ్వాన్స్ డ్ సిస్టమ్స్ సంస్థ అభివృద్ధి చేసింది. దీని రేంజి 20 కిలోమీటర్లు కాగా, మాక్ 4 వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి దీన్ని టార్గెట్ కు లాక్ చేస్తే దీన్నుంచి తప్పించుకోవడం అసాధ్యం. దీంట్లో అధునాతన ఎలక్ట్రో ఆప్టికల్, ఇమేజ్ ఇన్ ఫ్రారెడ్ వ్యవస్థలను అమర్చారు. తద్వారా లక్ష్యాలను సులువుగా గుర్తించి, విధ్వంసం సృష్టించగలదు.