Corona Virus: జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఒక్క‌రోజులో 1,508 మందికి క‌రోనా

8061 new cases in ts
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో క‌రోనా కేసుల  విజృంభ‌ణ కొన‌సాగుతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 8,061 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 5,093 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,19,966కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,45,683 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,150గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 72,133 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 1,508 మందికి క‌రోనా సోకింది. నిన్న మొత్తం 82,270 క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.  
  
Go Back to Shorts
Corona Virus
COVID19
Telangana

More Telugu News