డేవిడ్ వార్నర్ పై హీరోయిన్ ఈషా రెబ్బా సెటైర్లు!

Esha Rebba Setires on David Warner
  • ఆదివారం నాడు ఢిల్లీ, హైదరాబాద్ మధ్య మ్యాచ్
  • సూపర్ ఓవర్ లో నువ్వెందుకు బ్యాటింగ్ కు వెళ్లావు?
  • ట్విట్టర్ లో ప్రశ్నించిన ఈషా రెబ్బా
ఆదివారం నాడు ఢిల్లీ, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని జట్టు, సూపర్ ఓవర్ లో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ నిరాశకు గురికాగా, హీరోయిన్ ఈషా రెబ్బ వార్నర్ ను టార్గెట్ చేస్తూ, సెటైర్లు వేసింది.

"వార్నర్ అన్నా... ఇదేంటి? సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు నువ్వెందుకు వెళ్లావు? బెయిర్ స్టో, సుచిన్ ను ఎందుకు కాదన్నావు? నువ్వు ప్రయోగాలు చేయాలనుకుంటే డ్రీమ్ 11లో చేసుకో" అని వ్యాఖ్యానించింది. ఆమె కామెంట్లను చూసిన మిగతా వారు, టెన్షన్ వద్దంటూ, ఇంకా మ్యాచ్ లు ఉన్నాయంటూ ఈషారెబ్బను ఓదార్చే ప్రయత్నం చేశారు.


Go Back to Shorts
David Warner
Esha rebba
Twitter
Setire

More Telugu News