తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ సమీక్ష

SEC review on municipal elections in Telangana
  • తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
  • 27వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగింపు
  • ఈ నెల 30న పోలింగ్
  • మే 3న ఓట్ల లెక్కింపు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు... నకిరేకల్, సిద్ధిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. మే 3న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, పోలీసులు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ర్యాలీలు, సమావేశాలపై నిషేధం ప్రకటించారు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం నిషిద్ధమని వెల్లడించారు. ఈ నెల 27 నాటికి ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలని ఎస్ఈసీ స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Go Back to Shorts
SEC
Telangana Municipal Elections
Review
Telangana

More Telugu News