గాంధీ, కింగ్ కోఠి ఆసుపత్రుల్లో కొవిడ్ వార్డులను సందర్శించిన కిషన్ రెడ్డి
- హైదరాబాదులో కిషన్ రెడ్డి పర్యటన
- గాంధీ, కింగ్ కోఠి ఆసుపత్రుల్లో ఏర్పాట్ల పరిశీలన
- కొవిడ్ చికిత్స గురించి ఆరా
- మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
- ఆక్సిజన్ కొరత లేదని వెల్లడి
అనంతరం ఆయన తన సందర్శన వివరాలు తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో బెడ్లకు కొరతలేదని, కింగ్ కోఠి ఆసుపత్రిలోనూ ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. ఆక్సిజన్ కొరత లేదని తెలిపారు. కొవిడ్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి కరోనా వ్యాక్సిన్ కోటా పెంచమని కేంద్ర ప్రభుత్వంతో చెప్పానని అన్నారు.