హైదరాబాద్ ఆసుపత్రిలో కరోనాతో వ్యక్తి మృతి.. వెంటిలేటర్ ను ధ్వంసం చేసిన మనవరాలు!
- కింగ్ కోఠి ఆసుపత్రిలో నాలుగు రోజుల క్రితం చేరిన వృద్ధుడు
- ఆరోగ్యం విషమించి మృతి
- పెద్దగా అరుస్తూ గందరగోళం సృష్టించిన మనవరాలు
దీంతో, ఆయన వెంట ఉన్న యువతి (మనుమరాలు) కోపంతో పెద్దపెద్దగా అరుస్తూ గందరగోళం సృష్టించింది. ఆగ్రహంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. వెంటిలేటర్ ను బలంగా తోసేయడంతో అది పగిలిపోయింది. దీనిపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, నారాయణగూడ పోలీసులు వచ్చి ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఆమెపై ఆసుపత్రి వైద్యులు నారాయణగూడ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.