ఆపసోపాలు పడిన ముంబయి ఇండియన్స్... పంజాబ్ ముందు స్వల్ప లక్ష్యం
- చెన్నైలో ముంబయి ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్
- టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 రన్స్
- రోహిత్ శర్మ 63 పరుగులు
- సమష్టిగా సత్తా చాటిన పంజాబ్ బౌలర్లు
భారీ హిట్టర్లున్న ముంబయి జట్టు ఈ తరహాలో బ్యాటింగ్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. డికాక్ 3, ఇషాన్ కిషన్ 6, పొలార్డ్ 16, హార్దిక్ పాండ్య 1, కృనాల్ పాండ్య 3 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లు ఎంతో పకడ్బందీగా బంతులు వేయడంతో భారీ షాట్లు కొట్టేందుకు ముంబయి బ్యాట్స్ మెన్ సాహసించలేకపోయారు.