పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే
- 2019లో సీజేఐగా వచ్చిన ఎస్ఏ బోబ్డే
- ఈ సాయంత్రం పదవీ విరమణ
- నూతన సీజేఐగా ఎన్వీ రమణ
- రమణ సమర్థుడన్న బోబ్డే
2013లో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఏ బోబ్డే మాట్లాడుతూ, ఎంతో సంతృప్తికరంగా తన పదవీకాలం సాగిందని, ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తన వారసుడు, 48వ సీజేఐ ఎన్వీ రమణ సమర్థుడని కితాబునిచ్చారు.